ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), కుటుంబసభ్యులతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరగినట్టు సమాచారం.
RCB vs KKR Match: ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌లో భారత సైన్యం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం!
అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి తాజా పరిణామాల నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ స్వయంగా లోకేష్‌ను కుటుంబ సమేతంగా తనను కలవాలని కోరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నివాసానికి చేరుకున్న లోకేష్ కుటుంబాన్ని మోదీ హర్షంగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన ప్రధాని మోదీ, బ్రాహ్మణితో యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, చిన్నారి దేవాన్ష్‌ను దగ్గరికి తీసుకుని ప్రేమగా పలుకరించారు.
ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధిపై కేంద్ర సహకారం, విద్యా రంగానికి సంబంధించి కేంద్ర పథకాల అమలు, ఐటీ రంగంలో పెట్టుబడుల కల్పన తదితర అంశాలపై లోకేష్ ప్రధానమంత్రితో మాట్లాడినట్టు సమాచారం. మోదీతో సమావేశం రాజకీయంగా, పరస్పర సంబంధాల్లో ప్రాధాన్యత కలిగి ఉన్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.