Site icon HashtagU Telugu

Lokesh Delhi Tour : ఢిల్లీ బ‌య‌ల్దేరిన నారా లోకేష్‌.. ఏపీ పరిస్థితుల‌పై జాతీయ మీడియాకు ప్ర‌జెంటేష‌న్‌

Nara Lokesh

Nara Lokesh

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఏపీలో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు విష‌యంపై అధికారికంగా ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుని జైల్‌లో ములాఖ‌త్ అయిన త‌రువాత బ‌య‌టికి వ‌చ్చిన పొత్తును అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ జ‌న‌సేన నేత‌ల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.ఇటు వైసీపీ కూడా రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేస్తుంది. కేబినెట్ భేటీ.. అసెంబ్లీ స‌మావేశాల్లో ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇటు నారా లోకేష్ పాద‌యాత్ర కూడా ఆగిపోయింది. చంద్ర‌బాబు బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న పాద‌యాత్ర మొద‌లుకానుంది.

ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితులపై జాతీయ మీడియాతో నారా లోకేష్ మాట్లాడ‌నున్నారు. రాజ‌మండ్రి నుంచి ఢిల్లీకి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరారు. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు పై కేసు విషయం లో సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ వాదులతో కూడా లోకేష్ చ‌ర్చింనున్నారు. పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించెలా టీడీపీ వ్యూహం అమ‌లు చేయ‌బోతుంది. చంద్రబాబు అరెస్ట్ పై లోక్‌స‌భలో చర్చ జ‌రిగేలా పార్టీ ఎంపీల‌తో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఇటు కేంద్ర‌లో లోకేష్ ఎవ‌రెవ‌రిని క‌లుస్తార‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర మంత్రుల అపాయిట్‌మెంట్ ఖ‌రారు కాలేదు. మ‌రోవైపు ఇండియా కూట‌మిలో కీల‌క నేత‌ల్ని కూడా లోకేష్ క‌లుస్తార‌ని ప్ర‌చారం సాగుతుంది.