టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మరోసారి ఢిల్లీ (Delhi)కి బయలుదేరుతున్నారు. మరికాసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest ) అయ్యి..గత 29 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు తో పాటు ఆయన ఫై పలు కేసులు మోపింది CID . ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ లో లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినా తర్వాత ఢిల్లీ కి వెళ్లి..దాదాపు 25 రోజులు పాటు అక్కడే ఉన్నారు. మొన్ననే ఏపీకి వచ్చి , నిన్న చంద్రబాబు తో ములాఖత్ అయ్యారు. నేడు మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. వారం రోజుల పాటు లోకేష్ ఢిల్లీ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె చంద్రబాబు అరెస్ట్ తరుణంలో.. నేడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ క్రాంతితో క్రాంతి (Kanthi Tho Kranthi) అనే వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు నిచ్చింది. ఈరోజు రాత్రి 7 గంటలకు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. ఇళ్లలో లైట్లు ఆర్పి బయట కు వచ్చి ఐదు నిమిషాలు లైట్లు వెలిగించాలని పిలుపు నిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు. వారం రోజుల క్రితం మోతమోగిద్దాం అనే కార్యక్రమానికి పిలుపునివ్వగా..ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా స్పందన రావడం తో ఈరోజు క్రాంతితో క్రాంతి అనే కార్యక్రమం చేపడుతున్నారు.
Read Also : Hyderabad MMTS : హైదరాబాద్ లో మరో 6 ఎంఎంటీఎస్ సర్వీసులు.. యాదాద్రి దాకా పొడిగించే ప్లాన్