Site icon HashtagU Telugu

Nara Lokesh: ఏపీలో వైద్యులు గంజాయికి బానిసలవుతున్నారు: నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో వైద్యులే డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైద్యం చేయాల్సిన డాక్టర్లు మద్యానికి, డ్రగ్స్ కు బానిసై ఆస్పత్రిలో చేరుతున్నట్టు లోకేష్ పేర్కొన్నారు. డ్రగ్స్ బానిసల నుంచి చిన్నారులను కాపాడాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన భావి వైద్యులు గంజాయికి బానిసలుగా మారి ఆస్పత్రిలో రోగులుగా చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాగా మారాయని . డ్రగ్స్‌కు బానిసలైన కొందరు వైద్యుల దౌర్జన్య ప్రవర్తన చూసి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో పాఠశాల విద్యార్థులు గంజాయికి అలవాటు పడటాన్ని చూశానని లోకేష్ చెప్పారు. దీని కారణంగా యువత భవిష్యత్తు నాశనమవుతుందన్న ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ ముఠాలను అరికట్టాలని గతంలో ప్రధానికి లేఖ రాశానని తెలిపారు నారా లోకేష్. అయినా ఏపీలో గంజాయి తీవ్రత తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పాల్సిన కొందరు వైద్య విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారారని.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు.వైసీపీ పాలకులు పట్టించుకోవడం లేదని, డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలే పోరాడాలని సూచించారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ బానిసల నుంచి చిన్నారులను కాపాడాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Also Read: Hair Care: జుట్టు రక్షణ కోసం ఈ టిప్స్ ఫాలోకండి