Nara Lokesh : పదవుల పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh : పార్టీలో రెండుసార్లు పదవిలో ఉన్న వ్యక్తి అనంతరం ఉన్నత పదవికైనా వెళ్లాలి లేదా ఓ విడత విరామం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

టీడీపీ (TDP) పార్టీ లో పనిచేసే ప్రతి కార్యకర్త దగ్గరి నుండి కీలక నేత వరకు పార్టీ లో కీలక పదవిలో సాగాలని కోరుకుంటారు. చిన్న పదవి నుండి పెద్ద పదవి (Post) వరకు ఏదైనా సరే చంద్రబాబు (Chandrababu) హయాంలో ఓ పదవిలో ఉండాలి అంతే అని భావిస్తారు. కానీ ఇది అందరికి సాధ్యపడదు. కొంతమంది పదవులు రాలేదని చెప్పి అలకపాన్పు ఎక్కి పార్టీ కి రాజీనామా చేసిన వారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆలా పనిచేస్తున్న వారికీ చంద్రబాబు ఎప్పుడోకప్పుడు మంచి పదవి కట్టబెట్టి మంచి గుర్తింపు ఇస్తుంటారు.

Telugu Federation Conference : తెలుగు మహాసభల పై ఎంపీ చామల ఆగ్రహం

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం తో చాలామంది పదవుల కోసం తాపత్రేయపడుతున్నారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్ (Nara Lokesh) పదవుల పై కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన లోకేష్.. పార్టీలో రెండుసార్లు పదవిలో ఉన్న వ్యక్తి అనంతరం ఉన్నత పదవికైనా వెళ్లాలి లేదా ఓ విడత విరామం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇదే తత్వాన్ని తాను, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వంటి నేతలు అనుసరిస్తామని, అవసరమైతే సామాన్య కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పదవుల కోసం పోటీ పడుతున్న నేతలకు షాకింగ్‌గా మారాయి. టీడీపీలో వరుస పదవులు పొందడంపై నిర్ణయాత్మక వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంతో తన ఆలోచనను లోకేష్ వివరించారు. ఇదే విధానంతో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు పొలిట్ బ్యూరో వరకు ఎదిగే అవకాశాలు ఉంటాయని, దీనివల్ల పార్టీ బలపడుతుందని తెలిపారు. ఈ విధానం పార్టీకి సరైన భవిష్యత్తు ఉంటుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజాగా నామినేటెడ్ పదవుల (Nominated Posts) భర్తీపై కూడా లోకేష్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో నామినేటెడ్ పదవుల కోసం వేచిచూస్తున్న నేతలు మరికొంత కాలం ఓపిక పట్టాల్సి వస్తుంది. ఇక లోకేష్ వ్యాఖ్యలు పార్టీలో మిశ్రమ స్పందనలను రేకెత్తిస్తున్నాయి.

  Last Updated: 07 Jan 2025, 12:32 PM IST