Site icon HashtagU Telugu

Nara Lokesh : ఏపీలో రాక్షస పాలన..బీహార్ కంటే దారుణంగా తయారైంది

Lokesh Airport

Lokesh Airport

ఏపీలో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీని బీహార్ కంటే దారుణంగా వైసీపీ మాఫీయా మార్చేసింది. వైసీపీ నాయకుల నేరాలు..ఘొరాలకు సామాన్యులు వణికిపోతున్నారు. తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపిన ఎమ్మెల్సీ అనంత బాబ , యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షసక్రీడకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా కూడా పోలీసులు అతన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా సర్కార్ ఇచ్చిందా…సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని…ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను సర్కార్ ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

 

Exit mobile version