AP : జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాలా! – నారా లోకేష్

ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడం తో ఇరు పార్టీల నేతలు ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడుతున్నారు. ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ‘మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ పోస్ట్ […]

Published By: HashtagU Telugu Desk
Lokesh Vs Jagan

Lokesh Vs Jagan

ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడం తో ఇరు పార్టీల నేతలు ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడుతున్నారు. ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ‘మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ పోస్ట్ చేసారు.

‘జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాళ’ అని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా సీఎం జగన్ సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని లోకేష్ ఆరోపించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని నారా లోకేష్ అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయాన్ని (Secretariat) రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్… తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమేనని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికే తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2 నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.

Read Also : Curd: పెరుగులో ఈ గింజలు కలిపి తీసుకుంటే చాలు షుగర్ తగ్గిపోవడం ఖాయం?

  Last Updated: 05 Mar 2024, 02:21 PM IST