టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేతిలో ఉండే రెడ్ బుక్ (Red Book) లో ఏముంది..? ఎందుకు అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు..రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ (CID) అధికారులు సైతం ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతగా ఏముంది ఇందులో ఎంత సీన్ చేస్తున్నారు..? ఇవే ప్రశ్నలు గత కొద్దీ రోజులు వైసీపీ (YCP) శ్రేణులతో పాటు టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆసక్తిగా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో అసలు రెడ్ బుక్ లో ఏముందో టీడీపీ నేత నారా లోకేశ్ వివరణ ఇచ్చారు. ‘వైసీపీ ప్రభుత్వంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. కొందరు అధికారులు అధికార పార్టీకి మద్దతు పలుకుతూ విపక్షాలను ఇబ్బందులకు గురిచేశారు. ఆ బాధితుల కష్టాలను ‘రెడ్ బుక్ ‘లో రాశాం. త్వరలో ఆ బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని ఈ బుక్ గుర్తు చేస్తూ ఉంటుంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
“అధికారులు, పోలీసులు ఎప్పుడూ సరైన పంథాలో నడుచుకోవాలన్నది టీడీపీ సిద్ధాంతం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవు, వారిపై చర్యలు తీసుకోం. అయితే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, పాలకపక్షం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు, బెదిరింపులకు గురిచేసేందుకు కొందరు కళంకితులైన అధికారులు బరితెగించారు. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ ‘రెడ్ బుక్’ లో రాసుకోవడం జరిగింది. అంతే తప్ప మరోటి కాదు అని లోకేష్ స్పష్టం చేసారు.
Read Also : YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర