Site icon HashtagU Telugu

Nara Lokesh : సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ !..వైసీపీకి ఇది కామనే

Lokesh Getready

Lokesh Getready

ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పథకాన్ని అమలు చేసే విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులుండగా, ఈ పథకం కోసం రూ.13,000 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వైఎస్సార్సీపీ నేతలు బీపీఎల్ కుటుంబాలకు చెందని విద్యార్థులకి నిధులు అందడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత ఏడాది నిధులు బకాయిలుగా ఉన్నాయంటూ విమర్శించారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న కుటుంబాల పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Australia Lose: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవ‌టానికి కార‌ణాలీవే!

ఈ విమర్శలపై టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సూటిగా కౌంటర్ ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు తన ఖాతాలోకి వచ్చాయంటూ వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలను ఖండించారు. “నా అకౌంట్‌లోకి రూ.2000 జమ అయ్యాయంటూ ఆధారాలు చూపించండి,లేకపోతే మీ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి” అంటూ లోకేష్ 24 గంటల గడువు ఇచ్చారు. నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని వివరించిన లోకేష్, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం ద్వారా 9,600 పాఠశాలల్లో నాణ్యతను మెరుగుపరిచామని చెప్పారు. కొందరి అకౌంట్లు యాక్టివ్ కానందున డబ్బులు తిరిగి వచ్చాయని, ఖాతాలు యాక్టివ్ కాగానే నిధులు జమ చేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకం అంగన్‌వాడీ పిల్లలకు వర్తించదని స్పష్టత ఇచ్చారు. మధ్యాహ్న భోజనంగా సన్నబియ్యం వాడాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక జగన్ కు బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం అలవాటే అని, తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండి అంటూ ట్వీట్ చేసాడు.