Site icon HashtagU Telugu

Nara Lokesh : RTC డ్రైవర్ కు నారా లోకేష్ భరోసా..

Lokesh Rtc Driver

Lokesh Rtc Driver

కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు (RTC driver Lovaraju) పై విధించిన సస్పెన్షన్ను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎత్తివేసినట్టు ప్రకటించారు. “లోవరాజు తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నాము” అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తుని ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా చేస్తున్న రాజు..ఇటీవల నడిరోడ్డు పై బస్సు రిపేర్ కు రావడం తో బస్సు ముందు దేవర సాంగ్ కు స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.

ఈ వీడియో వైరల్ కావడం తో ఆయన డాన్స్ పై పాజిటివ్ స్పందన రావడమే కాదు..మంత్రి నారా లోకేష్ సైతం రాజు డాన్స్‌ను అభినందించి సోషల్ మీడియా పోస్ట్ చేసారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం రాజును విధుల నుంచి తొలగించారు. ఈ విషయం లోకేష్ దృష్టికి చేరుకోవడం తో ఆయన స్పందించి.. “లోవరాజు ఉద్యోగం లో చేర్చుకుంటామని, త్వరలోనే కలుస్తాను” అని ట్వీట్ చేసారు. ఈ ప్రకటన తర్వాత ఆర్టీసీ అధికారులు సస్పెన్షన్ ను ఎత్తివేయడం జరిగింది.

Read Also : K.S. Puttaswamy : జస్టిస్ కేఎస్ పుట్టస్వామి ఇకలేరు