మంగళగిరి (Mangalagiri) లో భారీ మెజార్టీ తో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ (Nara Lokesh).. నేడు సచివాలయంలో ఉదయం 9.45 గంటలకు ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు (Nara Lokesh Assumes Charge of IT, Education Minister) చేపట్టారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ తొలిసంతకం పెట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలు రూపొందించి క్యాబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి లోకేష్ తన ఛాంబర్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. సచివాలయంలో 4వ బ్లాక్ లోని మొదటి అంతస్థులో ఉన్న 208వ గదిలో లోకేష్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేష్ తన శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు లోకేశ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటె ఈరోజే గనులు – భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మూడో బ్లాక్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఛార్జి తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు మంత్రి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.
Read Also : Asteroid May Hit Earth: మరో 14 ఏళ్లలో భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం..!