AP Deputy CM : ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో మరో కొత్త పరిణామం జరగబోతోందా ? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కీలక పదవి దక్కబోతోందా ? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలని టీడీపీ కీలక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసేన రాజేష్ కూడా చేరారు. ‘‘వారసత్వం కారణంగా అందలం ఎక్కించడం ఎంత తప్పో, వారసత్వాన్ని కారణంగా చూపి అవకాశాలు కల్పించకపోవడం కూడా అంతే తప్పు’’ అని ఆయన చేసిన కామెంట్‌లో పెద్ద అంతరార్ధం ఉంది. వారసత్వాన్ని కారణంగా చూపించి నారా లోకేశ్ లాంటి ప్రజానేతకు అవకాశాలను కల్పించకపోవడం సరికాదనే అభిప్రాయాన్ని మహాసేన రాజేష్ పరోక్షంగా వెలిబుచ్చారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.
Also Read :Zuckerberg Vs Ashwini Vaishnaw : భారత ఎన్నికలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్
‘‘ఏపీలోని ఎన్డీయే కూటమి సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటు నారా లోకేష్ ఎక్కడో కూర్చుకుంటున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది నారా లోకేష్‌ను అనుకోకుండా నెట్టేస్తున్న వీడియో చూసి నాకు బాధ కలిగింది’’ అని మహాసేన రాజేష్(AP Deputy CM) తెలిపారు. ‘‘ఏపీలో ఎన్నికల సమయంలో లోకేశ్‌ను బాగా వాడుకున్నారు. ఆయనతో రాష్ట్రమంతా ప్రచారం చేయించారు. లోకేష్‌ను అంతగా వాడుకొని ఇప్పుడు కీలక పదవిని (డిప్యూటీ సీఎం పోస్టు) ఇవ్వకపోవడం తప్పు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో ఆలోచించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని తాను గతంలోనూ కామెంట్ చేశానని మహాసేన రాజేష్ గుర్తుచేశారు.
Also Read :Blow To Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ షాక్.. అధికారాల్లో కోత.. స్వేచ్ఛకు పరిమితి
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని తీసుకోక..
‘‘నారా లోకేశ్‌కు కూటమి ప్రభుత్వంలో తగిన అవకాశాలు లభించకపోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను టీడీపీలోకి వచ్చాను. ఆయనకే అవకాశాలు దక్కకుంటే ఎలా ? ఎవరో ఏదో అనుకుంటారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆలోచించి లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి’’ అని రాజేష్ డిమాండ్ చేశారు. ‘‘గతంలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా దూరంగా ఉండటం వల్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్ధితి వచ్చింది. దాన్నే ఉదాహరణగా తీసుకుని నారా లోకేశ్‌కు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలి’’ అని మహాసేన రాజేష్ కోరారు.
నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి
2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు.. అవమానాలు పడ్డాడు
నారా లోకేష్ పడ్డ కష్టం వల్లే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి
లోకేష్ అభిమానులుగా ఆయన్ని మూలన చూడడం మాకు నచట్లేదు – మహసేన రాజేష్
Video Credits – Mahasena Media pic.twitter.com/X5pQS6hO0G
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025