Nara Lokesh : లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే – సోమిరెడ్డి

Nara Lokesh : లోకేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, అవమానాలను జయించి

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh As A Ap Deputy

Nara Lokesh As A Ap Deputy

ఏపీలో రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. గత 10 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం (Nara Lokesh as a AP Deputy CM) పదవికి ఎంపిక చేయాలంటూ వరుసపెట్టి టీడీపీ నేతలు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. మొన్న మహాజన రాజేష్ , నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి (TDP Srinivas Reddy ), నేడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy). ఇలా వరుసపెట్టి నేతలు , పార్టీ శ్రేణులు తమ వాదనను వినిపిస్తుండడం..రాబోయే రోజుల్లో కూటమిలో ఎలాంటి చీలికలు వస్తాయో అని ఖంగారు పడుతున్నారు.

Rohit- Gambhir: టీమిండియాలో మ‌రోసారి విభేదాలు.. రోహిత్‌, గంభీర్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు?

నిన్న కడపలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభ సందర్భంగా సీఎం చంద్రబాబు వద్ద మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోకేశ్ టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో తరం నాయకుడిగా పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని , యువ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఆయనకు మరింత పెద్ద పదవిని అప్పగించాలని సూచించారు. ఇది పార్టీ యువతకు ప్రేరణగా నిలుస్తుందని, రాష్ట్రంలోని యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లోకేశ్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమిస్తే పార్టీలో సీనియర్ నేతలతో పాటు యువ నాయకుల్లో అనేక కొత్త ఆశలు కలిగే అవకాశం ఉందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy : హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..

ఈరోజు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కోరారు. లోకేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, అవమానాలను జయించి, తాను ఎలాంటి నాయకుడనో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఆయన పాదయాత్రలో చూపించిన నాయకత్వ లక్షణాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ప్రజలతో దగ్గరయ్యేలా చేశాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ రాజకీయ విస్తరణలో కీలక పాత్ర పోషించేందుకు ఆయనకు సరైన సమయమిదేనని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిలో ఒక సరికొత్త బాధ్యత ఇచ్చినట్లయితే, మరింత ఉత్తమమైన పాలనను అందించగలుగుతారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై ఇంతవరకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ స్పందించలేదు.

  Last Updated: 19 Jan 2025, 12:32 PM IST