Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అగ్రనేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని లోకేష్ కు చెప్పాలని కోర్టుకు ఏజీ శ్రీరామ్ చెప్పగా.. విచారణకు సహకరించాలని లోకేష్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. ఒకవేళ లోకేష్ విచారణకు సహకరించక అరెస్ట్ చేయాల్సి వస్తే.. కోర్టు అనుమతి తీసుకున్నాకే అరెస్ట్ చేస్తామని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం న్యాయస్థానానికి చెప్పారు. దీంతో ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులను ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులను అందించనున్నారు.
మరో రెండు కేసుల్లో..
నారా లోకేశ్ మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పిటిషన్లు వేసిన ఆయన.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశముంది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చంద్రబాబు హయాంలో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ చేపట్టిన భారీ ప్రాజెక్ట్. ఇందులో భారీ స్కామ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రధాన అభియోగం.
WE ARE AVAILABLE ON WHATSAPP CHANNEL: FOLLOW US
Also read : Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదల అయ్యేది ఆరోజే.. ఇట్స్ కన్ఫామ్
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతేడాది రంగంలోకి దిగింది ఏపీ సీఐడీ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చుతూ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. చంద్రబాబు, లోకేష్‌లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ఇక అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తుందా? అని చంద్రబాబు, సీఐడీ తరఫున న్యాయవాదులు (Chandrababu – Lokesh) ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.