AP News: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైకో ప్రభుత్వానికి సమయం దగ్గరపడిందని ఎద్దేవా చేశారు. వివరాలు చూస్తే.. కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోనుంచి విజయ్‌గోపాల్‌ని బయటకు తీసుకొచ్చి దాదాపు అర కిలోమీటరు మేర కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటనపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఫైర్ అయ్యారు. టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ గోపాల్ ని చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైకాపా సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన లోకేష్ బాధితులపై రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్‌గోపాల్‌పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా విజయ్ గోపాల్ ని చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైకాపా సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలక పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా… pic.twitter.com/bKzKqnbLYY
— Lokesh Nara (@naralokesh) November 13, 2023
Also Read: Minister Bosta Satyanarayana : మంత్రి బొత్స సత్యనారాయణకు హార్ట్ సర్జరీ.. నెల రోజుల పాటు విశ్రాంతి