Site icon HashtagU Telugu

AP Politics : ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై లోకేష్ మార్క్‌

Lokesh Law

Lokesh Mahanadu

ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవ‌ల దాకా జ‌న‌సేన‌, టీడీపీ క‌లుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఈ పొత్తుల‌పై నోరెత్త‌లేదు. పైగా ఆ పార్టీ నాయ‌కుల‌కు కూడా పొత్తుల గురించి ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తీసుకురావ‌ద్దంటూ హుకుం జారీ చేశార‌ట‌. ఎన్డీయేలో భాగ‌స్వామ్యం ఖాయ‌మంటూ వ‌స్తోన్న న్యూస్ ను ఖండించ‌డంలేదు. అంతేకాదు, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాను టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ క‌లిశార‌ని హోరెత్తిస్తున్నారు. వాళ్లిద్ద‌రూ క‌లిసిన విష‌యాన్ని అటు టీడీపీ ఇటు బీజేపీ ధ్రువీక‌రించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

Also Read: AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!

 

ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ 2018లో తెగ‌దెంపులు చేసుకుంది. ఆనాటి నుంచి మోడీ మీద వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు నిప్పులు గ‌క్కుతూ వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల త‌రువాత జాతీయ రాజ‌కీయ తెర‌మీద నుంచి పూర్తిగా ఆయ‌న త‌ప్పుకున్నారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ కేంద్రంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ వేడుకల సంద‌ర్భంగా కేవ‌లం ఐదు నిమిషాల పాటు చంద్ర‌బాబును పలుక‌రించారు. ఆ ఐదు నిమిషాల మీట్ ను మీడియా భూత‌ద్దంలో చూస్తూనే ఉంది. అంత‌కంటే ముందు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీకి టీడీపీ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డాన్ని లింకు చేస్తూ ఇక బీజేపీ, టీడీపీ క‌లిసిపోయిన‌ట్టే ఒక విభాగం మీడియా డిసైడ్ అయింది.

 

Also Read: KCR Follows Chandrababu: బాబు బాటలో సీఎం కేసీఆర్

 

తొలుత వ్యూహాత్మంగా చంద్ర‌బాబు కుప్పం స‌భ‌లో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు గురించి `ఒన్ సైడ్ ల‌వ్ ` అంటూ వ్యాఖ్యానించారు. దానికి ఆజ్యం పోస్తూ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యానికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ వెళ్లారు. ఇంకేముంది జ‌న‌సేన లేకుండా టీడీపీ ఓడిపోతుంద‌ని ప్ర‌చారం మొద‌లుపెట్టారు. వాపును చూసి బలుపు అనుకున్న జ‌న‌సేన `ప‌వ‌ర్` షేరింగ్ వ‌ర‌కు వెళ్లింది. అప్ర‌మ‌త్తమైన చంద్ర‌బాబు న‌ష్ట నివార‌ణ‌కు దిగారు. అనివార్యంగా పొత్తు కోసం జ‌న‌సేన వెంట‌ప‌డేలా రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మార్చేశారు.

ఏపీ వేదిక‌గా బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉన్న‌ప్ప‌టికీ ఎక్కడా క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌డంలేదు. తిరుప‌తి లోక్ స‌భ , బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల త‌రువాత జ‌న‌సేన పార్టీని బీజేపీ లైట్‌గా తీసుకుంది. ప‌వ‌న్ కు ఉన్న సినిమా క్రేజ్ రాజ‌కీయాల్లో లేద‌ని గ్ర‌హించిన‌ట్టు ఉంది. అందుకే, చంద్ర‌బాబును మ‌రోసారి బీజేపీ న‌మ్ముకుంటోంది. ఆయ‌న చ‌తుర‌త‌ను జాతీయ స్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది. అందుకే, ఇటీవ‌ల బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు కూడా చంద్ర‌బాబు విజ‌న్ గురించి ప్ర‌శంసించ‌డం మొద‌లుపెట్టారు. ఇలాంటి ప‌రిణామాల‌ను చూస్తుంటే, జ‌న‌సేన పార్టీని వ‌దిలించుకుని టీడీపీతో మాత్ర‌మే బీజేపీ అంట‌కాగేలా ఉంది. అప్పుడు ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోయే అవ‌కాశాలు లేక‌పోలేదు.