Site icon HashtagU Telugu

Amaravati Inner Ring Road Case : యువగళం కు భయపడే సీఎం జగన్ తప్పుడు కేసు పెట్టాడు – నారా లోకేష్

Lokesh

Police Case Filed on Nara Lokesh at Nallajarla Police Station with YCP Leaders Complaint

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Amaravati Inner Ring Road Case)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పేరును సీఐడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ (CID) ఈ రోజు మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణ (Narayana)పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో తనపేరు నమోదు చేయడం ఫై లోకేష్ స్పందించారు. నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినా, ఆగ‌ని యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌జైత్రయాత్ర‌గా ముందుకు సాగింది. మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నే స‌రికి, నా శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో న‌న్ను ఏ14గా చేర్చారు 420 సీఎం. రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ్రిడ్జి మూసేయించారని మండిపడ్డారు. నువ్వెన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్ర‌మ అరెస్టులు చేసినా నా యువ‌గ‌ళం ఆగ‌దు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్య‌మే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుంది. ఇచ్ఛాపురం వ‌ర‌కూ న‌డిపిస్తుందన్నారు.

Read Also : Fuel Depot Blast: గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు

నారా లోకేష్ స్పందన ఇలా ఉంటె టీడీపీ శ్రేణులు మాత్రం లోకేష్ ను సైతం జైల్లో వేస్తారేమో అని ఖంగారు పడుతున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు కేసుల విషయమై న్యాయవాదులో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ యాత్రను వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందే లోకేష్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది.