Nara Chandrababu Naidu : ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి.. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 07:23 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు అభ్యర్థులను ఫైనల్‌ చేయడంలో నిమగ్నమయ్యాయి. అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) దాదాపు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే.. పొత్తుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ (TDP) -జనసేన (Janasena) కూటమి ఇటీవల రానున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే.. దీంతో ఒక్కసారి ఇరు పార్టీల నుంచి టికెట్ ఆశించి భగ్గపడ్డ ఆశావహుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకొదరైతే ఏకంగా పార్టీలకు రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే.. ఈ క్రమంలో టీడీపీ చీఫ్‌ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వచ్చే ఎన్నికల్లో గెలిచి వైసీపీని దెబ్బకొట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలని, అప్పులు చెసి బటన్ నొక్కడం కాదన్నారు. పేదరికం లెని సమాజం చూడాలనేది ఎన్టీఆర్‌ కోరిక అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

చదువుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నా , ఒక్కొక్కరికీ 20, 000 వేలు ఇస్తామని, రైతులను ఆదుకుంటాం.. రైతును రాజును చేసే విధంగా బాధ్యత తీసుకుంటామన్నారు చంద్రబాబు. వెనుబడిన వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. బీసీ డిక్లరేషన్ ఇస్తామని, ఉచిత ఇసుక ఇస్తామని, పెట్రోల్ ధరలు నియంత్రిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఉత్తారాంధ్ర ద్రోహి జగన్ అని ఆయన మండిపడ్డారు. ఇక్కడి నేతలు వెన్నెముకలేని నేతలు అని, ఉత్తరాంధ్రను నాశనం చేశారన్నారు. ఉత్తరాంధ్ర సిజల స్రవంతి కి డబ్బులు ఇవ్వలేదని, స్పీకర్, మంత్రులకు అడిగే దమ్నుందా.? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర సాగునిటి ప్రొజెక్టులకు టిడిపి 1600 కొట్లు ఖర్చుచేస్తే.. వైసీపీ 594 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపొతున్నాయని, క్యాండిడెట్లు కూడా దొరకడం లేదన్నారు. కోఅర్డినేటర్లు అని చెప్పారు, సిద్దం అని మీటింగ్ పెట్టారు. 99 అభ్యర్దులను ఎమ్మెల్యేలు మేం ఎనౌన్స్ చేసామని, యుద్దం ప్రారంభించకముందే వైసీపీ వారు పారిపొతున్నారంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు.
Read Also : Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు సీటుపై సస్పెన్స్..?