AP : ఎన్నికల బరిలో నారా బ్రాహ్మణి..?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) పార్టీ ఈసారి రాష్ట్రంలో పసుపు జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఇరు అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల తాలూకా అభ్యర్థులను ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఈసారి టీడీపీ యువ నేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. […]

Published By: HashtagU Telugu Desk
Nara Brhamani Mp

Nara Brhamani Mp

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) పార్టీ ఈసారి రాష్ట్రంలో పసుపు జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఇరు అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల తాలూకా అభ్యర్థులను ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఈసారి టీడీపీ యువ నేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇందులో భాగంగా నారా బ్రాహ్మణి (Nara Brahmani) కి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని భావిస్తోందట.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణి ప్రసంగాలకు మద్దతు కనిపించింది. దీంతో, వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి పోటీ చేయటం ద్వారా పార్టీకి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం బ్రహ్మణి .. హెరిటేజ్ బాధ్యతల్లో ఉన్నారు. భువనేశ్వరితో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లో పోటీకి ఆసక్తి చూపుతారా అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే, పార్టీలో బలమైన నాయకత్వం..ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మణి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బ్రాహ్మణి ని విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయించే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Read Also :  Krishna Prasad : చంద్రబాబు ను తిడితేనే వైసీపీ లో పార్టీ టికెట్ – వసంత కృష్ణ ప్రసాద్

  Last Updated: 05 Feb 2024, 08:24 PM IST