Brahmani Lead TDP: లోకేష్ అరెస్ట్ అయితే బరిలోకి బ్రాహ్మణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతిపక్ష అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు.

Brahmani Lead TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతిపక్ష అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. ఇక అధికార పార్టీ చడీచప్పుడు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక నిన్న మొన్నటి వరకు హల్చల్ చేసిన జనసేన అధినేత తెలంగాణలో సినిమాలు చేసుకుంటున్నాడు. ఇదంతా చూస్తున్న ఆంధ్ర ప్రజలు ఏం జరుగుతుందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పార్టీ నాయకత్వంపై చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నారా లోకేష్‌ను అరెస్టు చేస్తే, పార్టీని నడిపించేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి రంగంలోకి దిగుతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి సమర్ధులైన నాయకుల కొరత లేదని, అవసరమైతే కొత్తనాయకులు రంగంలోకి దిగుతారంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు.

ప్రస్తుతం టీడీపీ పరిస్థితిని అంచనా వేస్తే ఆ పార్టీని నడిపించే సత్తా బ్రాహ్మణికి ఉందని అంటున్నారు. పార్టీని బ్రాహ్మణి చేతిలో పెడితే క్లాస్ గా నడిపిస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణికి రాజకీయ అనుభవం లేకపోయినా నడిపించే కెపాసిటీ ఆమెకు ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నారు టీడీపీ కేడర్. బిజినెస్ వ్యవహారాల్లో ఆమె చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పార్టీని ఆమె నడిపించడానికి పెద్దగా దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టును నారా లోకేష్‌ ఢిల్లీ స్థాయిలో అంశాన్ని తీసుకెళ్లేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో అవినీతి కేసు ఆయనపై ఏపీ సీఐడీ మోపింది. ఈ నేపథ్యంలో లోకేష్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు అర్ధం అవుతుంది.

Also Read: Singareni: సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్, కవిత హర్షం