Nara Brahmani Bike Ride: లద్దాక్ కొండల్లో నారా బ్రాహ్మణి బైక్‌ రైడ్

నారా బ్రాహ్మణి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలిగా, నారా లోకేష్‌కు సతీమణిగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముద్దుల కూతురిగా అందరికీ సుపరిచితమే.

నారా బ్రాహ్మణి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలిగా, నారా లోకేష్‌కు సతీమణిగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముద్దుల కూతురిగా అందరికీ సుపరిచితమే. సినీ, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ధైర్యంగా ముందుకెళ్తూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే తనలో మరో ప్రత్యేక టాలెంట్ ఉందని తాజాగా చాటుకున్నారు. లద్దాక్‌లోని లేహ్ ప్రాంతంలో బైక్ రైడింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ స్పోర్ట్స్‌ బైక్ మీద హిల్స్ స్టేషన్‌ ఏరియాలో ఆమె ప్రయాణించారు.  ప్రమాదకరమైన రోడ్ల మీద సునాయాసంగా ఆమె రైడింగ్ చేసి అబ్బురపరిచారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే ఇష్టమని, ఆమె ఒక ప్రొఫెషనల్  ‘బైక్ రైడింగ్ గ్రూపు’ లో సభ్యురాలనే విషయాలు తెలిశాయి.

 

కాగా డేరింగ్ రైడ్‌లో తాను చేసిన అడ్వంచర్ల గురించి బ్రాహ్మణి స్వయంగా ఆ వీడియోలో పంచుకున్నారు. ఉదయమే బయలుదేరామని, బైక్ రైడింగ్ చేస్తూ ఉదయం 6:30 గంటలకు తిక్‌సెయ్ మఠం చేరుకున్నామని చెప్పారు. లెహ్ చాలా అందంగా ఉందన్నారు. అందమైన ఆధ్యాత్మిక అనుభూతి చెందానని చెప్పారు. అక్కడే ధ్యానం చేశామని, టిఫిన్ చేశామని తెలిపారు. కాగా అధిక బరువుండే స్పోర్ట్స్ బైక్‌ను బ్రాహ్మణి సునాయాసంగా నడుపుతున్నట్టు వీడియోలో కనిపించింది. కొండల మధ్య రయ్‌రయ్ మంటూ ఆమె దూసుకెళ్లిన తీరు ఈ వీడియో చూసిన నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతా ఫిదా అయిపోతున్నారు. ఆమె ఒక మంచి బైక్ రైడరంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆమె టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్రాహ్మణి నడిపిన బైక్ పసుపు రంగులో ఉండటం మరో విశేషం.