TDP : ఉత్తరాంధ్రలో ముగిసిన నారా భువ‌నేశ్వ‌రి నిజం గెలవాలి పర్యటన.. బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు.. మీకు మేమున్నామంటూ చంద్రబాబు

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు.. మీకు మేమున్నామంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి ఉత్తరాంధ్ర పర్యటన 3వ రోజు విశాఖపట్నం, గాజువాకలో నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికమరణానికి గురైన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. నోవాటెల్ విడిది కేంద్రం నుండి మొదటగా విశాఖ సౌత్ నియోజకవర్గంలోని 47వ వార్డులో టీడీపీ కార్యకర్త జాగరపు చిన్న(47) కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న 03-10-2023న గుండెపోటుతో మరణించారు. చిన్న భార్య గౌరి, కుమార్తెలు దేవి, నందిని, కుమారుడు కిరణ్ లను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. కుటుంబపెద్ద లేరని అధైర్య పడొద్దు.. మీకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. అనంతరం 41వ వార్డులోని మలిశెట్టి రమణ(55) కుటుంబాన్ని పరామర్శించారు. రమణ 2023 అక్టోబర్ 9న గుండెపోటుతో మృతిచెందారు. వారి కుమారుడు రాజు, కోడలు సంతోషి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్నివేళలా అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 45వ వార్డులో పంచిరెడ్డి కనకారావు(52) కుటుంబాన్ని పరామర్శించారు. కనకారావు 2023 సెప్టెంబర్ 13న గుండెపోటుతో మరణించారు. వారి భార్య పార్వతి, కుమార్తె ఉదయశ్రీ, కుమారుడు శ్యామ్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులని, వారికి పార్టీ అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. భోజన విరామం అనంతరం గాజువాక నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మొదటగా గాజువాక 65వ వార్డులోని కోరుకొండ వెంకటరమణ(61) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటరమణ భార్య మంగ, కుమారుడు శ్రీను, కుమార్తె లక్ష్మిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.

Also Read:  TDP : మైల‌వ‌రంలో బొమ్మ‌సాని ఆత్మీయ స‌మావేశం.. టికెట్ త‌న‌కే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోర‌ని బొమ్మ‌సాని

  Last Updated: 05 Jan 2024, 10:25 PM IST