Nara Bhuvaneswari : కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు : నారా భువనేశ్వరి

టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మృతి ఎంతో బాధిస్తోందని అన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలోనే చంద్రబాబు జైలు నుండి బయటకు వస్తారని భోరసా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అనంతరం మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా..రెండవ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. తొట్టెంబేడు మండల పరిధిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి భువనేశ్వరి పరామర్శించారు. తంగెళ్లపాలెంనకు చెందిన మోడెం వెంకటరమణ, కొనతనేరికి చెందిన గాలి సుధాకర్, కాసరంనకు చెందిన పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందారు. గురువారం నారా భువనేశ్వరి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Also Read:  CBN : నేడు హైకోర్టులో చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌

  Last Updated: 27 Oct 2023, 07:04 AM IST