Nijam Gelavali : రేప‌టి నుంచి శ్రీకాకుళం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌

చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు జరగనుంది. రేప‌టి నుంచి (నవంబర్ 1వ తేదీ నుండి 3 తేదీ వరకు) నారా భువనేశ్వరి మలివిడత నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై మనోవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, 2వ తేదీన విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల, బొబ్బిలి, 3వ తేదీన విజయనగరం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు నిజం గెలవాలి సభల్లో ఆమె పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

మ‌రోవైపు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాద బాధితుల‌ను నారా భువ‌నేశ్వ‌రి ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఆసుపత్రిలో పరామర్శిస్తారు. మంగళవారం రాజమహేంద్రవరం నుండి బయలుదేరి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళతారు. బాధితుల పరామర్శ అనంతరం ఆముదాలవలస వెళ్లి అక్కడ బస చేస్తారు. బుధవారం నుండి మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో చంద్ర‌బాబు నాయుడు 50 రోజులుపైగా రాజ‌మండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేస్తుంది. అయితే బాబు అక్ర‌మ అరెస్ట్‌పై మ‌నోవేద‌న‌కు గురై ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు గుండెపోటుతో మ‌ర‌ణించారు. వారికి భ‌రోసా ఇచ్చేందుకు నారా భువనేశ్వ‌రి నేరుగా వెళ్లి వారిని క‌లిసి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిస్తున్నారు.

Also Read:  Indrakeeladri : క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి హుండీ లెక్కింపు.. భారీగా వ‌చ్చిన కానుక‌లు

  Last Updated: 31 Oct 2023, 08:26 AM IST