TDP : “నిజం గెలవాలి” పేరుతో జ‌నంలోకి నారా భువ‌నేశ్వ‌రి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై టీడీపీ ఆందోళ‌న‌లు చేస్తునే ఉంది. అయితే క్యాడ‌ర్‌లో మ‌రింత జోష్

Published By: HashtagU Telugu Desk
Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై టీడీపీ ఆందోళ‌న‌లు చేస్తునే ఉంది. అయితే క్యాడ‌ర్‌లో మ‌రింత జోష్ నింపేందుకు చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి రంగంలోకి దిగ‌నున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నాయుడుకు ఇంకా ఊరట లభించకపోవడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వరుస కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మ‌ర‌ణించిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాలను కలుసుకోవడమే లక్ష్యంగా ఆమె పర్యటనలు సాగనున్నాయి. వారంలో కనీసం రెండు లేదా మూడు ప్రాంతాల‌ను సందర్శించాలా ప్రణాళిక రూపొందించారు. చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా ఆగిపోయిన భవిష్యత్‌కి గ్యారెంటీని కర్నూలులో మళ్లీ కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణపై చర్చించేందుకు రానున్న నాలుగైదు రోజుల్లో పార్టీ సమావేశం జరగనుంది. టీడీపీ కూడా ప్రజాసమస్యలపై తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, పార్టీ కార్యకలాపాలు, పోరాటాల వేగం పెంచాలని నిర్ణయించింది.ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ కోసం కోర్టుల్లో పోరాటం చేయడంతో పాటు ప్రజల్లోనూ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుంది. టీడీపీ వ‌రుస కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ వాతావరణం వేడెక్కింది.

Also Read:  Noorie Dog: రాహుల్ కుక్కపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకు ఎంఐఎం

  Last Updated: 19 Oct 2023, 09:52 AM IST