Nara Bhuvaneswari :రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 11:54 AM IST

నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari ) రేపటి నుండి మూడు రోజులపాటు ఏపీ (AP) లో పర్యటించబోతున్నారు. ‘నిజం గెలవాలి’ (‘Nijam Gelavali’ Yatra) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా భువనేశ్వరి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలుసుకునే లక్ష్యంతో ఆమె ప్రారంభించిన నిజం గెలవాలి యాత్ర చేస్తుండగానే చంద్రబాబుకు బెయిల్ లభించడం, జైలు నుంచి విడుదల కావడం జరిగిపోయాయి. దీంతో భువనేశ్వరి యాత్ర కూడా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ యాత్ర ప్రారభించబోతున్నారు.

రేపటి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. 3వ తేదీన విజయనగరం జిల్లా, 4న శ్రీకాకుళం జిల్లా, 5న విశాఖపట్నం జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ప్రస్తుతానికి ఇక్కడే వరకే షెడ్యూల్ ఖరారు చేశారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనలు కూడా ఖరారయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 5 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారు. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కనిగిరిలో ఈ నెల 5న చంద్రబాబు తొలి బహిరంగ సభ ఉంటుంది. ఇలా సాగే ప్రతి సభకు లక్ష మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా పర్యటించేందుకు నారా లోకేష్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఇంటింటికి వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ అవ్వని నియోజక వర్గాలకు నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇలా మొత్తం బాబు , లోకేష్ లు తమ పర్యటనలతో బిజీ కాబోతున్నారు.

Read Also : CBI Notice : డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు