Site icon HashtagU Telugu

Bhuvaneswari : బెయిల్ పై విడుదలైన యువగళం వాలంటీర్లకు నారా భువనేశ్వరి పరామర్శ.. మీ రుణం తీర్చుకోలేనిదంటూ.!

Bhuvaneswari

Bhuvaneswari

నారా లోకేష్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి అన్నారు. యవగళంలో లోకేష్ తో పాటు కొసాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ప్రారంభం నుండి లోకేష్ కు వెన్నంటి ఉంటున్న యువగళం వాలంటీర్లకు భువనేశ్వరి కృతజ్ఞతలు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

భీమవరం నియోజకవర్గం.. గునుపూడిలో యువగళం పాదయాత్రపై నాటి ఘటనలో 43 మంది వాలంటీర్లపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. నెల రోజులుగా జైల్లో ఉన్న వీరు ఈ రోజు బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన వాలంటీర్లను నారా భువనేశ్వరి కలుసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసున్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల కష్టం, త్యాగం తాము ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని అన్నారు. వాలంటీర్లపై అక్రమ కేసులు త‌మ‌ని ఎంతో బాధించాయని.. వాలంటీర్లు జైలు నుండి విడుదల అవుతున్నారని తెలియగానే వారిని చూడాలని చెప్పాన‌ని భువనేశ్వ‌రి తెలిపారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి వాలంటీర్ల‌ను అకారణంగా జైల్లో పెట్టారని భువ‌నేశ్వ‌రి ఆరోపించారు.

Also Read:  YSRTP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా షర్మిల..?

సెప్టెంబర్ 5న భీమవరం నియోజకవర్గం గునుపూడిలో యువగళం పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. దీనిలో యువగళం వాలంటీర్లకే గాయాలయ్యాయి. వైసీపీ అల్లరిమూకలను అదుపు చేయని పోలీసులు బాధితులైన వాలంటీర్లపైనే 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాలంటీర్లను సెప్టెంబర్ 6న భీమవరంలో కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో సుమారు నెల రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండులో ఉన్న వాలంటీర్లు శనివారం బెయిల్ పై విడుదల అయ్యారు