Site icon HashtagU Telugu

Nara Bhuvaneshwari : రాజమండ్రిలో భువనేశ్వరి కన్నీరు.. చంద్రబాబుని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Nara Bhuvaneswari emotional comments with media after meeting Chandrababu Naidu in Rajahmundry Jail

Nara Bhuvaneswari emotional comments with media after meeting Chandrababu Naidu in Rajahmundry Jail

ఏపీ(AP)లో ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మూడు రోజుల నుంచి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక చంద్రబాబుని రాజమండ్రి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. చాలా మంది ఆయనను కలవడానికి ప్రయత్నిస్తున్నా నేడు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే చంద్రబాబుని కలవడానికి అనుమతి ఇచ్చారు.

రాజమండ్రి జైలులో నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), నారా లోకేష్(Nara Lokesh), బ్రాహ్మణి మాత్రమే చంద్రబాబుని కలిశారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడారు.

నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఏమని మాట్లాడమంటారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మనిషి కష్టపడ్డారు. ఆయన జీవితాంతం మీ కోసం మాట్లాడారు. కుటుంబం కోసం మాట్లాడలేదు. నాకు ముందు ప్రజలే ముఖ్యం తర్వాతే కుటుంబం అనేవాళ్ళు. ఆయన నిర్మించిన బిల్డింగ్ లోనే ఆయన్ని కట్టిపడేశారు. మీ కోసం పోరాడే మనిషి, ఆయన కోసం మీరు పోరాడాలి. నేను ఆయనని చూసి బయటకు వచ్చేటప్పుడు నాలోని ఒక భాగాన్ని అక్కడ వదిలేసి వచ్చాను. ఇది మా ఫ్యామిలీకి చాలా కష్టమైన విషయం అని అన్నారు.

అలాగే.. అయన భద్రతపై భయంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. అయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యం చెప్పారు. ఎవరూ భయపడవద్దని చెప్పారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు నారా భువనేశ్వరి.

 

Also Read : House Remond rejected : జైలులో చంద్ర‌బాబు ఎన్నాళ్లు..? ఏసీబీ కోర్టులో ఏం జ‌రుగుతోంది.?