Site icon HashtagU Telugu

Save Democracy – Save AP : ‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్” – నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Comments

Nara Bhuvaneswari Comments

స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అక్రమంగా తన భర్తను జైల్లో పెట్టారని..45 ఏళ్ల నుండి ప్రజలు కోసం చంద్రబాబు (Chandrababu) కష్టపడి పనిచేస్తున్నారని..అలాంటి పెద్దాయనను 19 రోజులుగా జైల్లో పెట్టి ఆవేదనకు గురి చేస్తున్నారని నారా భువనేశ్వరి (nara bhuvaneswari) ఆగ్రహం వ్యక్తం చేసారు. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) ద్వారా రెండు లక్షల మందికి చంద్రబాబు దారిచూపించారని ..పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌లో వేలాది మంది శిక్షణ పొందారన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏ తప్పు చేసినట్టు నిర్థారించలేకపోయారని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని.. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారని భువనేశ్వరి అన్నారు.

చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారని , రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా పనిచేస్తున్న మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సృష్టికి మూలమైన మహిళలను అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్.. సత్యమేవ జయతే” (Save Democracy – Save Andhra Pradesh..Satyamev Jayate) అంటూ భువనేశ్వరి నినాదాలు చేశారు. బుధువారం రాజమండ్రి లూధరన్ చర్చిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు.

Read Also : ICMR Study: ఉప్పు అతిగా వాడుతున్న భారతీయులు.. ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి..!