Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 03:53 PM IST

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్ ఫై టీడీపీ మండిపడింది. ‘భువనేశ్వరి (Nara Bhuvaneswari) చెప్పింది ఏంటి, ఈ సైకో ఫేక్ చేసింది ఏంటో చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ అని ఆమె మాట్లాడిన పూర్తి వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు. ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ..తన మనసులో ఒక కోరిక కలిగిందని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కుప్పంలో నాకు మద్దతిస్తారా…? చంద్రబాబు గారికి మద్దతిస్తారా…? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు… ఈసారి నన్ను గెలిపిస్తారా…? అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు. అలా కుదరదు… ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు . ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని… రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు… అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే దీనిని వైసీపీ మీడియా ”35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈ సారి విశ్రాంతి ఇచ్చి..తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు” అనుకుంటున్నా అనేది మాత్రం ఉంచి మిగతా అన్న మాటలు కట్ చేసి..పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ చూసిన చాలామంది భువనేశ్వరి ఏంటి ఇలా అన్నారు..? నిజంగా చంద్రబాబు కుప్పం నుండి బరిలోకి నిల్చోరా..? భువనేశ్వరి పోటీ చేస్తే గెలుస్తుందా..? అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఈ చర్చ ఎక్కువ అవుతుండడం తో టిడిపి ఫుల్ వీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది.

Read Also : Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?