Site icon HashtagU Telugu

Bhuvaneswari : రాష్ట్రం కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా..? : జ‌గ్గంపేట దీక్ష‌లో నారా భువ‌నేశ్వ‌రి

Bhuvaneswari

Bhuvaneswari

రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు. ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసన‌ దీక్షలో భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారని తెలిపారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని.. ప్రజల్ని ముందుకు నడిపించడమే చంద్రబాబు లక్ష్యమ‌ని భువ‌నేశ్వ‌రి తెలిపారు.

అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారని.. ఆయనేం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు.? అని ఆమె ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ప్రజల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదు..మా కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదన్నారు. తాను హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నా..అందులో 2 శాతం అమ్ముకున్నా రూ.4 వందల కోట్లు వస్తాయని తెలిపారు.సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి ఎన్టీఆర్ అని.. అలాంటి వ్యక్తి నీడలో తాను పెరిగానన్నారు.తాను, బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేద‌రి..ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటే ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2 వేల మంది అనాథ పిల్లలను ఉచితంగా చదివిస్తున్నామ‌ని.. అలాంటి సేవే మాకు ఎన్టీఆర్ చూపించిన మార్గమ‌న్నారు.

చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు..ప్రజలు అనే తపిస్తుంటారని. ప్రజలకు ఏం చేద్దాం అన్నదానిపై ఆయన ఆలోచిస్తారని భువ‌నేశ్వ‌రి తెలిపారు. హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారని..కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని ఆనాడు అందరూ నవ్వారని..కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని..చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడని భువ‌నేశ్వ‌రి తెలిపారు.