Site icon HashtagU Telugu

Nara Bhuvaneswari : భువ‌నేశ్వ‌రి బ‌స్సుయాత్ర‌కు రూట్‌మ్యాప్ సిద్ధం.. ! నిమ్మాకూరు టూ నారావారిప‌ల్లెకి “మేలుకో తెలుగోడా” యాత్ర‌

Nara Bhuvaneswari Comments

Nara Bhuvaneswari Comments

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిని స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం ఆరోప‌ణ‌ల కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయ‌న‌కు కోర్టు రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్ప‌టి నుంచి ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత లోకేష్‌ని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందంటూ ప్రచారం సాగింది. అయితే సీఐడీ అధికారులు లోకేష్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 22 రోజుల త‌రువాత ఇన్న‌ర్‌రింగ్ రోడ్డు కేసులో అవినీతి జ‌రిగిందంటూ సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి నారా లోకేష్‌కి నోటీసులు ఇచ్చారు.

చంద్ర‌బాబు అరెస్ట్‌తో నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఆగిపోయింది. రెండు రోజుల క్రితం యాత్ర‌ను పునఃప్రారంభించాల‌ని నారా లోకేష్ భావించిన‌ప్ప‌టికి చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్ వాయిదా ప‌డ‌టంతో సీనియ‌ర్ నేత‌లంతా పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకోవాల‌ని సూచించారు.దీంతో య‌వ‌గళం పాద‌యాత్ర వాయిదా ప‌డింది. అయితే యాత్ర ప్రారంభం అయ్యేలోపే లోకేష్‌ని అరెస్ట్ చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఒక‌వేళ లోకేష్ అరెస్ట్ అయితే బ్రాహ్మ‌ణి రంగంలోకి దిగుతార‌ని టీడీపీ నేత‌లు తెలిపారు. ఆగిన చోట నుంచే యువ‌గ‌ళం యాత్ర‌ను ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

మ‌రోవైపు నారా భువ‌నేశ్వ‌రి కూడా ప్ర‌జాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె కూడా సిద్ధ‌మైయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర చేప‌ట్టాల‌ని ఆమె నిర్ణ‌యించారు. త‌న పుట్టిన గ‌డ్డ కృష్ణాజిల్లా నిమ్మ కూరు నుంచి త‌న మెట్టినిల్లు అయిన నారావారిప‌ల్లె వ‌ర‌కు బ‌స్సుయాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు సమాచారం. చంద్ర‌బాబు జైల్లో ఉండ‌టం లోకేష్ ఢిల్లీలో న్యాయ‌స‌ల‌హాల కోసం అక్క‌డ ఉండ‌టంతో క్యాడ‌ర్‌లో కాస్త జోష్ త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో క్యాడ‌ర్‌కి ధైర్యం నింపేందుకు భువ‌నేశ్వ‌రి బ‌స్సుయాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ బ‌స్పుయాత్ర‌కు “మేలుకో తెలుగోడా” అనే పేరరి ఖ‌రారు చేసిన‌ట్లు టీడీపీ నేత‌లు తెలిపారు. ఇప్ప‌టికే యాత్ర‌కు సంబంధిచిన రూట్‌మ్యాప్‌ను సీనియ‌ర్ నేత‌లు సిద్ధం చేశారు. ఈ వారంలో బ‌స్సుయాత్ర ప్రారంభంకానున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.