Site icon HashtagU Telugu

Nara Bhuvaneswari : నారా భువనేశ్వ‌రి ప్ర‌చార ర‌థం సిద్ధం.. నిజం గెల‌వాలి పేరుతో జ‌నంలోకి

Bhuvaneswari

Bhuvaneswari

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు నారా భువ‌నేశ్వ‌రి యాత్ర చేప‌ట్టారు. నిజం గెల‌వాలి పేరుతో భువ‌నేశ్వ‌రి బ‌స్సుయాత్ర చేయ‌నున్నారు. ఈ రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న భువ‌నేశ్వ‌రి.. నారావారిప‌ల్లి వెళ్ల‌నున్నారు. రేపు అక్క‌డి నుంచి బ‌స్సుయాత్ర ప్రారంభించ‌నున్నారు. ఇందుకోసం టీడీపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది. భువనేశ్వ‌రి కోసం నిజం గెల‌వాలి పేరుతో బ‌స్సును సిద్ధం చేశారు. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు బ‌స చేసే బ‌స్సుని నిజం గెల‌వాలి అంటూ చంద్ర‌బాబు భువ‌నేశ్వ‌రి స్టిక్క‌ర్ల‌తో సిద్ధం చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత మ‌ర‌ణించిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను భువనేశ్వ‌రి పరామ‌ర్శించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్ర‌బాబు 45 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో తీర్పు రిజ‌ర్వ్ అయింది. చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత పార్టీ కార్య‌క్ర‌మాల్నీ ఆగిపోయాయి. పార్టీ క్యాడ‌ర్‌లో జోష్ నింపేందుకు ఆగిపోయిన కార్య‌క్ర‌మాల‌న్నింటిని పునఃప్రారంభించాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది, ఇటు నారా లోకేష్ కూడా భ‌విష్య‌త్ గ్యారంటీ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్ర‌బాబు బ‌య‌టికి వ‌చ్చేందుకు న్యాయ‌పోరాటం చేస్తునే ప్ర‌భుత్వ అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల్ని జ‌నంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధ‌మైంది

Also Read:  Train Derails At Avadi: తప్పిన పెను ప్రమాదం.. చెన్నైలో పట్టాలు తప్పిన రైలు