జగన్ (CM Jagan)..చంద్రబాబు ఫ్యామిలీ (Chandrababu Family) ఫై పగబట్టాడా..? రాష్ట్రంలో తనకు ఎదురు ఎవ్వరు ఉండకూడదని అనుకుంటున్నాడా..? తాను చెప్పిందే జరగాలి..చేసేదే న్యాయం..చెప్పిందే వేదం అనేలా ప్రవర్తిస్తున్నాడా..? తాను జైలు జీవితం గడిపా..ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు కూడా గడపాలని చూస్తున్నాడా..? అందుకే వరుస పెట్టి చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులపై కేసులు పెట్టిస్తున్నాడా..? ప్రస్తుతం ఏపీలోని టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Scam Case)లో చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arresy) చేయించాడు..దాదాపు 20 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నాడు..ఎక్కడ బెయిల్ కూడా రావడం లేదు..ఏసీబీ కోర్ట్ , హైకోర్టు , సుప్రీం కోర్ట్ ఇలా అన్ని కోర్ట్ ల చుట్టూ చంద్రబాబు తరపు లాయర్లను పరుగులు పెట్టెల చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్ (Amaravati Inner Ring Road Scam Case) లో నారా లోకేష్ ను ఇరికించాడు. కేవలం లోకేష్ (Nara Lokesh) మాత్రమే కాదు నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari), బ్రాహ్మణి (Nara Brahmani)లను కూడా ఈ కేసులో ఇరికించబోతున్నట్లు తెలుస్తుంది.
చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కల్పించారని, అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్‌కు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods)ను ఏ6గా పేర్కొంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్ చైర్‌పర్సన్, ఎండీగా… చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య బ్రాహ్మణి ఎక్జిక్యుటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారని, వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారాలను చంద్రబాబు, లోకేష్(lokesh)లు నడిపిస్తున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి చంద్రబాబు, లోకేష్‌లు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారనీ న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో సీఐడీ తెలిపింది. ఈ కేసులో సిట్ అధికారులు కీలకమైన 129 ఆధారాలను గుర్తించినట్లుగా కూడా సీఐడీ చెబుతోంది. పక్కా ప్లాన్ తోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో మార్పులు చేశారనీ, హెరిటేజ్ సంస్థకు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారనీ సీఐడీ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ క్రిడ్‌ప్రోకో జరిగిన సమయంలో లోకేష్ కేవలం హెరిటేజ్ డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారు. కానీ ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మేనేజ్‌మెంట్ హోదాలో ఉన్నారు. దాంతో.. ఈ కేసులో భువనేశ్వరి, బ్రాహ్మణి లను కూడా అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. ఈ అనుమానాలను నిజం చేస్తూ కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు కుటుంబమంతా టీమ్ వర్క్‌గా దోపిడీలో భాగస్వామ్యం అయ్యిందని మంత్రి రోజా (Minister Roja) ఆరోపణలు చేసారు. చంద్రబాబు చేసిన పాపాలకు భువనేశ్వరి కూడా శిక్ష అనుభవించక తప్పదు అన్నట్లుగా రోజా వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి సైతం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు, లోకేష్ లతో పాటూ నారా బ్రాహ్మణి, భువనేశ్వరిల పేర్లు కూడా సీఐడీ మెమో ఫైల్ చేసినట్లు తమకు సమాచారం అందిందని, దీనిపై ఎలా పోరాడాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే బ్రాహ్మణి, భువనేశ్వరిలను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.