Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రహ్మణి ములాఖత్

వారానికి రెండు సార్లు కలుసుకునే అవకాశం ఉండటంతో ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి చంద్రబాబుని కలిశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Chandrababu: వారానికి రెండు సార్లు కలుసుకునే అవకాశం ఉండటంతో ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి చంద్రబాబుని కలిశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ములాఖత్ ద్వారా చంద్రబాబును వారానికి రెండు సార్లు కలుసుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో నారా కుటుంబసభ్యులు 12, 14,18, 25 తేదీలలో చంద్రబాబును కలిశారు.

నాలుగు రోజుల క్రితం 25న భువనేశ్వరి, బ్రాహ్మణి, పార్టీ పెద్ద అచ్చెన్నాయుడు చంద్రబాబుని కలిశారు. నాయుడు ఆరోగ్య పరిస్థితులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక పార్టీ వ్యవహారాలను అచ్చెన్నాయుడు చంద్రబాబుకి వివరించారు. రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో టీడీపీకి పెరుగుతున్న ప్రజా మద్దతు గురించి డిస్కస్ చేశారు. కాగా ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బాబును కలుసుకున్నారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి బ్రాహ్మణి, భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఇంటి భోజనం చేసి చంద్రబాబుకు పంపిస్తున్నారు. నిత్యం కార్యకర్తలతో భేటీ అవుతూ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు.

నారా లోకేష్ ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో బ్రాహ్మణి పార్టీ బాధ్యతను మోస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ నారా లోకేష్ పై కేసు నమోదు చేసింది. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను కూడ ఏ 14గా సీఐడీ చేర్చింది.ఈ కేసులో సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు ఏపీ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా ఈ రోజు హైకోర్టు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. దీంతో సిఐడి విచారణకు లోకేష్ హాజరు కావాల్సిందే.

Also Read: CM Jagan : వైఎస్ఆర్ వాహ‌నమిత్ర నిధులు విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్‌