Nara Bhuvaneswari: తన సోదరుడు బాలకృష్ణ గురించి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) సరదా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో విద్యార్థులతో సమావేశమైన భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు తక్కువ చూస్తా. డైరెక్టర్ల గురించి తెలియదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నారా భువనేశ్వరి ఏం మాట్లాడారంటే.. మీ అందరికీ చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హిజ్ నాట్ మై యంగర్ బ్రదర్ హిజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్లా ఉన్నాడు తమ్ముడు ఎట్లా ఉన్నాడు అని అడుగుతారు ఐ డొంట్ లైక్ ఈట్ యాక్చువల్లీ లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహా నాయుడు అండ్ సమర సింహా రెడ్డి అఖండ ఐ లైక్ అఖండ ఒక డైలాగ్ మా కోసం వేయండి మేడమ్ ఏంటమ్మా డైలాగ్ ఒక్కటి డైలాగులా నా వల్ల కాదు ప్లీజ్ మ్యామ్ ఐ యామ్ వెరీ బ్యాడ్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను నేను సినిమాలు అన్ని చాలా తక్కువ చూస్తాను డైలాగులు అసలు నా ఒంట పట్టదు మేము మేమంతా వెయిట్ చేస్తున్నాం మేడమ్ ఇట్లా ఆఫీస్‌లో లెక్చరర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోచింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్ ఆ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు సమ్ కళ్లతో చెప్పండి మేడమ్ ఆ దట్ డైలాగ్ ఒక వైపు చూడు మరోవైపు చూడమాకా అది అని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత బాలయ్య బాబు అఖండ-2 చిత్రంలో నటించనున్నారు.