టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య (Technical Problem) రావడం అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం డోర్ తెరుచుకోకపోవడం తో కాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విమానంపై ఏం జరిగిందో అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న వారే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ మళ్లీ టేకాఫ్ చేశారు. దీంతో వీల్ బయటకు రావడంతో సేఫ్ ల్యాండింగ్ అయింది. గాల్లో చక్కెర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు ఎయిర్‌పోర్టులో దిగడంతో విమానంలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే..ప్రస్తుతం ఫోకస్ అంత ఏపీ ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నాడు. అలాగే రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది.
Read Also : Prices Of Liquor: ఈ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్.. రూ. 80 వరకు పెరగనున్న ధరలు..!