చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మూడో రోజు కు ఈ యాత్ర చేరుకుంది. గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలో యాత్ర కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఈ సందర్బంగా మహిళలతో సమావేశమవుతూ..వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెపుతూ వస్తున్నారు.
మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం.. ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆమె అందించారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో తన ట్విట్టర్ వేదికగా..ఈ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ గురించి చెప్పుకొచ్చింది. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వపడుతున్నాని.. నిజం గెలవాలి కార్యక్రమానికి జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో తమకు ఎంతో ఊరటనిస్తోందన్నారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని అన్నారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నాను ‘ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
Read Also : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం