Site icon HashtagU Telugu

TDP : మీ ఓటుతో ఫ్యాన్‌ రెక్కలు ఊడి కిందపడాలిః నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari comments on ap govt

Nara Bhuvaneshwari comments on ap govt

Nara Bhuvaneshwari: ఏపిలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ఎన్నికల ప్రచారం నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రామకుప్పం, కుప్పలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ(YCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల దోపీడీకి ప్రజలు బలవుతున్నారన్నారు. మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలి అని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెబుతూ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడును లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆమె చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుండటంతో కుప్పం టీడీపీ నేతల్లో జోష్ నెలకొంది.

Read Also:New T20 Jersey: టీమిండియా కొత్త జెర్సీ ఇదే.. ధ‌రెంతో తెలుసా..?