Site icon HashtagU Telugu

CM Jagan: జ‌గ‌న్ తో తియ్య‌తియ్య తియ్య‌గా..

Jagan Imresizer

Jagan Imresizer

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఆ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా కీల‌క నేత‌లు, మాజీ మంత్రులు పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని), కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)లు క‌లిసి క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది. కేబినెట్ మినిస్ట‌ర్లుగా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్‌తో క‌లిసి చాలా స‌న్నిహితంగా క‌లిసి క‌నిపించిన ఈ ఇద్ద‌రు నేత‌లు, మాజీ మంత్రుల‌య్యాక జ‌గ‌న్‌తో క‌లిసి క‌నిపించిన దాఖలాలే లేవు.

ఈ క్ర‌మంలో గురువారం జ‌గ‌న్‌తో పేర్ని, కొడాలి క‌లిసి క‌నిపించారు. నేత‌న్న‌నేస్తం నిధుల విడుద‌ల కోసం కృష్ణా జిల్లా పెడ‌న‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి వెళ్లిన జ‌గ‌న్‌ను వేదిక మీదే పేర్ని, కొడాలి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కాస్తంత చొర‌వ చూపిన పేర్ని నాని సీఎం జ‌గ‌న్‌కు స్వీటు తినిపించారు. ఈ స‌మ‌యంలో కొడాలి నాని కూడా పేర్ని నాని వెనుకే నిల‌బ‌డి ఉన్నారు. ఈ ఫొటోను పెడ‌న కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోల‌లో ఒక‌టిగా సీఎంఓ విడుద‌ల చేసింది.