Site icon HashtagU Telugu

Kodali Nani : లోపల వేస్తారనే భయంతోనే నాని అమెరికాకు వెళ్తున్నాడా..?

Nani Us

Nani Us

జగన్ (Jagan) అండ చూసుకొని గడిచిన ఐదేళ్లు రెచ్చిపోయిన వైసీపీ నేతలు (YCP Leaders)..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు అవ్వడం , జైల్లో వేయడం చేసిన సర్కార్..మిగతా నేతలను కూడా లోపల వేసేందుకు సిద్ధం అవుతుంది. దీంతో ఆయా నేతలు అరెస్ట్ భయంతో హాస్పటల్ పాలవుతున్నారు. వీరిలో కొడాలి నాని (Kodali Nani) ఒకరు. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నాని..ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గుండె ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న నానిపై ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వల్లభనేని వంశీ జైలులోకి వెళ్లిన నేపథ్యంలో, ఆయన తర్వాత నానినే అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో నాని అమెరికా కు పయనం అవుతున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.

Liquor Prices: తెలంగాణ‌లోని మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఫుల్ బాటిల్‌పై భారీగా పెంపు!

హైదరాబాద్ లో ఉంటే.. సేఫ్ కాదని అమెరికా వెళ్తేనే మంచిదని నాని అనుకుంటున్నారట. ఇందు కోసం ట్రంప్ తీసుకు వచ్చిన గ్రీన్ కార్డు వీసా సహా చాలా అవకాశాలు పరిశీలించారు. ప్రస్తుతానికి మెడికల్ వీసా తీసుకుని వెళ్తున్నారని తర్వాత అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటారని చెబుతున్నారు. వంశీ కూడా గతంలో అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించారు కానీ.. కూటమి సర్కార్ ను తక్కువ అంచనా వేసి హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపైనే కుట్రలు చేశారు. ఇప్పుడు జారిపోతున్న ప్యాంట్లు లాక్కుంటూ కోర్టుకు.. జైలుకు మధ్య తిరుగుతున్నారు. మొత్తానికి చంద్రబాబు సైలెంట్ గా వైసీపీ నేతలకు ప్యాంట్లు జారిపోయేలా చేస్తున్నాడు.