Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క బెటర్ – ఎంపీ నందిగాం సురేష్

Pawan Kalyan Barrelakka

Pawan Kalyan Barrelakka

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన (Janasena) పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. పోటీ చేసిన 8 స్థానాల్లో కేవలం ఓ స్థానంలో మాత్రం చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయి. మిగతా 07 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. దీంతో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విమర్శలు , సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా పెట్టుకొని దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క (barrelakka) బెటర్ అంటూ ఎంపీ నందిగాం సురేష్ (Nandigam Suresh) కామెంట్స్ చేసాడు.

తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. వైఎస్‌ జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి.. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేన్నరు.

ఇక కొల్లాపూర్ లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ప్రచారంలో గట్టిపోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క ఓడిపోయినా.. ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లే సాధించారు. కొల్లాపూర్ లో జాతీయ పార్టీ బీఎస్పీ కంటే ఆమె ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. తెలంగాణలో 7 చోట్ల జనసేన అభ్యర్థుల కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు పడడం విశేషం. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయనకు తాజా ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కేవలం 5,308 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ్మినేని వీరభద్రం కంటే కూడా బర్రెలక్క ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. మొత్తం మీద బర్రెలక్క ఓడిపోయినప్పటికీ గెలిచినంత పేరు వస్తుంది.