Site icon HashtagU Telugu

Nandamuri Ramakrishna : ఐదేళ్ల రాక్షస పాలనలో చిప్ప కూడా లేకుండా చేసిన జగన్..

Nandamuri Ramakrishna Video Message To Ap Voters About Polling Day

Nandamuri Ramakrishna Video Message To Ap Voters About Polling Day

Nandamuri Ramakrishna : 2024 ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరగనంత ఉత్కంఠగా జరగబోతున్నాయి. వైసీపీని గద్దె దించడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ.. ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపొందే కోసం అన్ని పార్టీలు శతవిధాలు ప్రయత్నాలు చేసాయి. స్టార్ కాంపెయినర్స్ ని తీసుకొచ్చి తమ పార్టీ తరుపున ప్రచారం చేసారు. అయితే నిన్నటితో ప్రచార కార్యక్రమానికి ముగింపు పడింది. రేపు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోమని.. పలువురు ప్రముఖులు సందేశాలు ఇస్తున్నారు.

ఈక్రమంలోనే నందమూరి తారక రామారావు వారసుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ.. ఏపీ ప్రజలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పరిపాలన చూశాం. ఒక రాజధాని లేకుండా, రక్షణ లేకుండా, భవిష్యత్తు, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఆఖరికి చిప్ప కూడా లేకుండా చేసింది వైసీపీ జగన్ ప్రభుత్వం. ఏపీలో జీవించాలంటేనే భయపడే స్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది” అంటూ పేర్కొన్నారు.

అలాంటి వైసీపీకి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చిన రామకృష్ణ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, యువతీయవకులకు విజ్ఞప్తి చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని రాష్ట్రాన్ని సరైన బాటలో పెట్టాల్సిన భాద్యత మనందరి పై ఉందని గుర్తు చేసారు. రండి కదిలి రండి, మీ విలువైన ఓట్లు తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు.

Also read : Renu Desai : టీడీపీ అభ్యర్థిని గెలిపించండి అంటూ రేణూదేశాయ్ పోస్ట్ వైరల్..