Chandrababu Remand: వచ్చేది చంద్రబాబు అధికారమే: నందమూరి రామకృష్ణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్టు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. బాబు అరెస్టుని తప్పుబట్టేవాళ్లే తప్ప సీఎం జగన్ తీరుని ప్రశంసించే వాళ్ళు కరువయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Chandrababu Remand

New Web Story Copy 2023 09 14t155730.853

Chandrababu Remand: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. బాబు అరెస్టుని తప్పుబట్టేవాళ్లే తప్ప సీఎం జగన్ తీరుని ప్రశంసించే వాళ్ళు కరువయ్యారు. ఎందుకంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసే పద్ధతి ఇది కాదంటూ అనుకూల వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్ష్యగానే చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆ పార్టీకి మరింత మైలేజ్ పెరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చంద్రబాబు రిమాండ్ తో జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. రాజమండ్రి వెళ్ళి స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో బాలయ్య నడుస్తుండటం శుభపరిణామంగా భావిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుందని పవన్ కళ్యాణ్ సంకేతాలిచ్చారు. ఈ రోజు మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుని కన్ఫర్మ్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తంగా చేశారు . తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కొండంత ధైర్యాన్నిస్తున్నారు. నీకు నేనున్నాను తమ్ముడు అంటూ చేయందించాడు.

ఇక చంద్రబాబు అరెస్టుని నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒక్కొక్కరు ఆయన అరెస్టుపై స్పందిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుని దేశంలోని ప్రముఖులు అందరూ ఖండిస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ అరెస్ట్ చేశారని అధికార పార్టీని దుయ్యబట్టారు. జగన్ నిరంకుశ పాలనపై అలాగే చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలవాలన్నారు. ఈ క్రమంలో అవసరమైతే పోరాటం చేయాలని సూచించారు.

చంద్రబాబుపై మోపిన కేసు జగన్ స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందని అన్నారు, తాను అనుకున్నట్టే అరెస్ట్ చేయించాడని జగన్ పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని చెప్పారు.

Also Read: NTR Off To Dubai : దుబాయ్ వెళ్లిన జూ.ఎన్టీఆర్..ఈ సమయంలో వెళ్తావా అంటూ ట్రోల్స్

  Last Updated: 14 Sep 2023, 04:01 PM IST