Nandamuri Politics : నంద‌మూరి బాణాలు.!

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, మాజీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి హెరిటేజ్ కంపెనీ ఓన‌ర్‌. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Brahmani Key Role in TDP

Nara Brahmani Bhuvaneswari

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, మాజీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి హెరిటేజ్ కంపెనీ ఓన‌ర్‌. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కార్య‌క్ర‌మాలు, ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్ వేదిక‌ల‌పై అనేక సార్లు ఆమె ప్ర‌సంగించారు. అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకొచ్చిన‌ప్ప‌టికీ ట్ర‌స్ట్‌, హెరిటేజ్ వ‌ర‌కు ఆమె మాట‌లు ప‌రిమితం. కానీ, ఇప్పుడు తిరుప‌తి వేదిక‌గా రాజ‌కీయ ప‌ర‌మైన అంశంపై స్పందించారు. ఆమె శీలంపై అసెంబ్లీ వేదిక‌గా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశాన్ని మీడియా ప్ర‌స్తావించింది. ప్ర‌త్యేకించి కొడాలి నాని, వ‌ల్ల‌నేని వంశీ గురించి రెస్సాండ్ కావాల‌ని విలేక‌రులు కోరారు. దాంతో ఆమె సున్నితంగా వైసీపీ వాల‌కాన్ని మంద‌లించింది.సాధార‌ణంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మీడియా ముందుకొస్తుందంటే, కొన్ని ప్రొటోకాల్స్ ను టీడీపీ మీడియా విభాగం పాటిస్తుంది. ఆయా ప‌త్రికలు, టీవీ ఛాన‌ల్స్ నుంచి ఎవ‌రు ప్రెస్ మీట్ కు హాజ‌ర‌వుతున్నారో..తెలుసుకుంటుంది. పార్టీకి అనుకూల మైండ్ సెట్ ఉండే జ‌ర్న‌లిస్ట్ ల చేత కొన్ని ప్ర‌శ్న‌ల‌ను అడిగిస్తుంది. వివాద‌స్ప‌ద ప్ర‌శ్న‌లు అడగొద్ద‌ని మిగిలిన జ‌ర్న‌లిస్ట్ ల‌ను ముందుగానే రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇలా…ప్రాంతీయ పార్టీల ఆఫీస్ ల్లో స‌హ‌జంగా కొన‌సాగే ప్ర‌క్రియ‌. టీడీపీ ఆఫీస్ లో అయితే, ఈ టైప్ ప్రొటోకాల్ ఎక్కువ‌గా ఉంటుంది.

PRC Issue : జ‌గ‌న్ ‘రివ‌ర్స్ పీఆర్సీ’ దెబ్బ

తిరుప‌తికి భువ‌నేశ్వ‌రి వెళ్లిన సంద‌ర్భంగా కూడా ఇలాంటి ప్రొటోకాల్ ను టీడీపీ మీడియా విభాగం అనుస‌రించి ఉంటుంది. ఆ క్ర‌మంలోనే స‌మ‌సి పోయిన ఆమె శీలం వ్య‌వ‌హారాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చి ఉంటార‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఆమె కూడా చాలా సున్నితంగా ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా స‌మాధానం ఇచ్చారు. స‌హ‌జంగా అలాంటి ప్ర‌శ్న‌లు ఆక‌స్మాత్తుగా ఎదురైన‌ప్పుడు సెల‌బ్రిటీలు కొంత అస‌హ‌నం ఫీల‌వుతుంటారు. కానీ, భువ‌నేశ్వ‌రి చాలా స‌హ‌జంగా, ప‌రిణితి చెందిన రాజ‌కీయ‌వేత్త‌లాగా స‌మాధానం ఇవ్వ‌డం వెనుక `ప్రొటోకాల్ ` ఉంటుంద‌ని విశ్లేష‌కుల భావ‌న‌.రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం కాబ‌ట్టి మీడియా నుంచి ఇలాంటి ప్ర‌శ్న ఎదుర‌వుతుంద‌ని ముందుగానే ఆమె ఊహించి ఉండొచ్చు. లేదంటే, అంత హుందాగా స‌న్నితమైన మంద‌లింపు అప్ప‌టిక‌ప్పుడు రావ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఆమె స్పంద‌న విన్న వారంతా రాజ‌కీయాల్లోకి రావ‌డానికి అనువైన ల‌క్ష‌ణాలన్నీ ఆమెలో ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఇప్పుడున్న‌ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గ‌ట్టెక్కించడాని స‌ర్వ‌శ‌క్తులు చంద్ర‌బాబు ఉప‌యోగిస్తున్నారు. జూనియ‌ర్ దూరంగా ఉంటోన్న క్ర‌మంలో నంద‌మూరి ప్లేవ‌ర్ ను పార్టీకి బాగా ఎక్కించాలంటే భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని పార్టీలోని కొందరి భావ‌న‌.

`వాళ్ల పాపాన వాళ్లే పోతారు.. అలాంటి అంశాల గురించి టైం వేస్టంటూ..` అంటూ వంశీ, కొడాలి నానికి సున్నితంగా రాజ‌కీయ మంద‌లింపు భువ‌నేశ్వ‌రి ఇచ్చారు. ఆమె ఇచ్చిన స‌మాధానంతో వాళ్లిద్ద‌రు ఉలిక్కి ప‌డి ఉంటారు. అందుకే, నాని రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి రియాక్ష‌న్ ను గ‌మ‌నిస్తోన్న టీడీపీ లోని కొంద‌రు రాబోయే రోజుల్లో భువ‌నేశ్వ‌రి ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌న్న అభిప్రాయానికి వస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి ల‌ను అస్త్రాలుగా ఉప‌యోగించాల‌నే అంశం అంత‌ర్గ‌తంగా బ‌య‌లు దేరింది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. సో..చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద ఉన్న బ‌ల‌మైన నంద‌మూరి శ‌స్త్రాల‌ను ఎప్పుడైనా బ‌య‌ట‌కు తీయొచ్చ‌న్న‌మాట‌.

  Last Updated: 21 Dec 2021, 02:11 PM IST