Nandamuri Family : నందమూరి “సింహ” గర్జన

నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన మ‌హిళ‌లు ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఎక్క‌డా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ చిత్రంపై క‌నిపించ‌రు.

  • Written By:
  • Updated On - November 20, 2021 / 03:11 PM IST

నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన మ‌హిళ‌లు ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఎక్క‌డా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ చిత్రంపై క‌నిపించ‌రు. అనివార్య కార‌ణాల‌తో పురంధ‌రేశ్వ‌రి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇటీవ‌ల స్వ‌ర్గీయ హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని కూడా యాదృచ్ఛికంగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. మిగిలిన కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ ప్ర‌త్యక్షంగానూ, ప‌రోక్షంగానూ క‌నిపించ‌రు. వాళ్ల వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు ఎవో చూసుకుంటుంటారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నంద‌మూరి మ‌హిళ‌లు ఎవ‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో క‌నిపించ‌లేదు.

Also Read : `వ్య‌క్తిత్వ హ‌న‌న` ఈనాటిది కాదు..!

ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఎంతో హుందాగా ఉంటారు. ఎక్క‌డా నోరు జార‌కుండా జాగ్ర‌త్తగా మాట్లాడ‌తారు. ఆమె పార్ల‌మెంట్లో చేసిన ప్ర‌సంగాల‌ను మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి వాళ్లు ఎంద‌రో ప్ర‌శంసించారు. ఆమె టాలెంట్ ను గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన మంత్రిత్వ‌శాఖ‌ల‌ను అప్పగించింది. రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ పార్టీలో ఉండ‌కూడ‌ద‌ని బీజేపీలోకి వ‌చ్చిన పురంధ‌రేశ్వ‌రి టాలెంట్ ను మోడీ, అమిత్ షా గుర్తించారు. అందుకే, ఆమెకు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని అప్ప‌గించారు. ఇక సుహాసిని ఇటీవ‌లే తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఆమెను 2018 ఎన్నిక‌ల బ‌రిలోకి దింపారు. ఎంతో సౌమ్యంగా క‌నిపించే ఆమె ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థులను తూల‌నాడ‌లేదు.

Also Read : NTR Vs CBN : విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పురంధ‌రేశ్వ‌రి, సుహాసిని మాత్ర‌మే కాదు, నంద‌మూరి ఆడ‌ప‌డుచులు హుందాగా వ్యాపారాలు చేస్తుంటారు. హెరిటేజ్ లాంటి సంస్థ‌ల‌ను అగ్ర‌గామిగా తీర్చిద్దిన వీర వ‌నిత భువ‌నేశ్వ‌రి. దాదాపు 10వేల మందికి పైగా ఉద్యోగ‌స్తులు ఆ సంస్థ‌లో ప‌ని చేస్తున్నారు. ప‌‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది హెరిటేజ్ సంస్థ ద్వారా జీవనం కొన‌సాగిస్తున్నారు. అలాంటి ఉత్త‌మ మ‌హిళ‌ను ఏపీ అసెంబ్లీ వేదిక‌గా కించ‌ప‌ర‌చ‌డం నంద‌మూరి అభిమానుల‌కే కాదు, బాధ్య‌త‌గ‌ల ప్ర‌తి పౌరుడుకు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. దిగ‌జారిపోయిన రాజ‌కీయాలను అస‌హ్యించుకుంటారు.మునుపెన్న‌డూ లేని విధంగా ఈసారి ఏపీ అసెంబ్లీ వేదిక‌గా బూత‌పురాణం తారాస్థాయికి చేరింది. కుటుంబ‌లోని మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డం కూడా ఫ్యాష‌న్ గా భావిస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండ‌డం దుర‌దృష్టం. అసెంబ్లీ బ‌య‌ట మీడియా ముందు నోరుపారేసుకోవ‌డం కొంద‌రికి స‌ర‌దా అయింది. అమ్మ‌న‌క్క‌లు తిట్ట‌డం ఆన‌వాయితీగా మారింది. మీడియా ఎదుట ఎంతో బాధ్య‌త‌గా మాట్లాడాల‌న్న సోయ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్ప‌డానికి నంద‌మూరి ఫ్యామిలీ ఇప్పుడు న‌డుం బిగించింది.

భువ‌నేశ్వ‌రి శీలాన్ని ప్ర‌శ్నిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌పై నంద‌మూరి బాల‌క్రిష్ణ మండిప‌డ్డాడు. ప్ర‌త్య‌ర్థుల‌కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఎవ‌రైనా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న త‌మ కుటుంబ స‌భ్యుల జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని ప్ర‌త్య‌ర్థుల‌ను కాస్త ఘాటూగా హెచ్చ‌రించాడు. ఆ సంద‌ర్భంగా నంద‌మూరి ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు ఆయ‌న‌తో చాలా మంది ఉన్నారు. వాళ్లెవ‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్న వాళ్లు కాదు. అంటే, రాబోవు రోజుల్లో ఇలాగే కించ‌ప‌రిస్తే , అందరూ క‌లిసి రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించాల్సి ఉంటుంద‌నే సంకేతాన్ని ప‌రోక్షంగా ఇచ్చారు.
బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న పురంధ‌రేశ్వ‌రి త‌న సోద‌రి భువ‌నేశ్వ‌రికి మ‌ద్ధ‌తుగా నిలిచారు. భువ‌నేశ్వ‌రి వ్య‌క్తిత్వ గురించి గురించి వివ‌రించారు. అంటే, అవ‌స‌ర‌మైతే.. నంద‌మూరి ఫ్యామిలీ అంతా ఒక‌ట‌వుతుంద‌నే సంకేతం ఇచ్చారు. ఇక ప్ర‌త్య‌ర్థులు మార‌క‌పోతే..నంద‌మూరి ఫ్యామిలీ రంగంలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.