సెక్రటేరియట్ (Secretariat) వద్ద ‘బైబై జగన్’ (CM Jagan) అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ వద్ద ‘బైబై జగన్’ అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడంతో పోలీసులు బారీకేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ మేరకు టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బాలకృష్ణ మండిపడ్డారు. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ… వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని… అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు, మాట్లాడుతూ… అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎమ్మెల్యేలు డి.బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు తదితర నాయకులు ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా, అనేక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. 2019 ఎన్నికల సమయానికి సీఎం. కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, మద్యపాన నిషేధం, ఉద్యోగ క్యాలెండర్ విడుదల తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతిపరుడని, అందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రతిపక్ష నేతలు కూడా అన్నారు. ప్లకార్డులు, ఇతర సామాగ్రితో శాసనసభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వారి ప్రయత్నాన్ని పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందన్న ఉద్దేశంతో ‘బై బై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ పక్కకు నెట్టడంపై పోలీసులతో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర వాగ్వాదానికి దిగారు.
Read Also : Google Map : గూగుల్ తల్లి సాయంతో దొంగను పట్టుకున్న యువకుడు..
