Site icon HashtagU Telugu

Chigurupathi Jayaram Case: చిగురుపాటి జయరాం హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన నాంపల్లి కోర్టు

Nampally Court Gave Sensational Verdict In Chigurupathi Jayaram Murder Case

Nampally Court Gave Sensational Verdict In Chigurupathi Jayaram Murder Case

చిగురుపాటి జయరాం (Chigurupathi Jayaram) హత్య కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు… ఆయనకు జీవితఖైదును విధించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించి, వారిపై నమోదైన కేసును కొట్టివేసింది. 2019 జనవరి 13న చిగురుపాటి జయరాం (Chigurupathi Jayaram) హత్యకు గురయ్యారు. ఆయనను హత్య చేసిన రాకేశ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

2017లో ఆయనకు తన మేనకోడలు శిఖా చౌదరి (Shikha Chaudhary) ద్వారా రాకేశ్‌ రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం అతని వద్ద నుంచి రూ.4 కోట్లు అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.6 కోట్లు చెల్లించాలని రాకేశ్‌ రెడ్డి ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో జయరాం అతని ఫోన్‌ తీయడం కూడా మానేశాడు. అమెరికా వెళ్లిపోయి కొంతకాలం తర్వాత వచ్చాడు. ఇది తెలిసిన రాకేశ్‌ రెడ్డి… జయరాంను హనీ ట్రాప్‌ వేసి ఒక చోటుకు రప్పించి కిడ్నాప్‌ చేశాడు. జూబ్లీ హిల్స్‌లోని తన ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని అప్పటి నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ వద్దకు, తర్వాత హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిప్పి విజయవాడ వైపు తీసుకెళ్లాడు. నందిగామ వద్ద రోడ్డు పక్కన కారు వదిలేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడి పోలీసులు టోల్‌ ప్లాజాల్లో సీసీ కెమెరాల్లో పరిశీలించిగా ఆ కారును రాకేశ్‌ రెడ్డి నడుపుతున్నట్టు తేలింది.

Also Read:  Shatabhisha Nakshatram: శతభిషా నక్షత్రంలోకి శని.. వచ్చే 7 నెలలు ఈ రాశుల వాళ్లకు లాభాలు