Site icon HashtagU Telugu

AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం

Nallamilli Ramakrishna Reddy

Nallamilli Ramakrishna Reddy

AP Elections 2024: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు ఇస్తున్న సమయంలోనే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి. టీడీపీ, బీజేపీ సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు మరోసారి తన రాజకీయ మైండ్ గేమ్ ఆడాడు. టీడీపీలో పోటీలో నిలిచిన అయిదుగురు అభ్యర్దులను మార్చారు. ఇదే సమయంలో అనపర్తి సీట్లు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

బీజేపీకి సరైన అభ్యర్థులు లేకపోవడంతో చంద్రబాబు స్వయంగా తన పార్టీ నేతనే బీజేపలోకి పంపించి, ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేయాలనీ నిర్ణయించారు. దీంతో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పసుపు జెండా వదిలేసి కాషాయ జెండా అందుకునేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అయితే ఆ స్థానంలో టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా తన సీటు బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. మరోవైపు ఆ సీటు పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పరిధిలో ఉండటంతో పురందేశ్వరి తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తుపై పోటీకి దింపేందుకు సిద్ధమయ్యారు.. ప్రస్తుతం రాజకీయంగా అనపర్తిలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.

We’re now on WhatsAppClick to Join

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులకు ఫారమ్‌లను పంపిణీ చేస్తూ అభ్యర్థులకు విషెస్ తెలిపారు. అందరూ గెలవాలని ఆకాంక్షించారు. టీడీపీ అభ్యర్థులు పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలను నెరవేర్చేందుకు అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు. మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ బి ఫారం అందుకున్న తర్వాత తన తండ్రి చంద్రబాబు నాయుడు పాదాలను తాకారు. బి ఫారాలు పొందిన వారిలో అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కనుమూరు రఘు రామకృష్ణం రాజు తదితరులు ఉన్నారు. అయితే ఓవైపు టీడీపీ బీఫారాలతో బిజీగా ఉండగా టీడీపీ నేతా బీజేపీ అభ్యర్థిత్వాన్ని పొందారు. ఇక్కడే బాబు రాజకీయ ఎత్తుగడ ఏంటో అర్ధం అవుతుంది.

Also Read: Chandrababu: దమ్ముంటే పవన్‌తో సంసారం చెయ్ జగన్