Site icon HashtagU Telugu

Vote For Pawan : పవన్ గెలుపు కోసం ప్రచారంలోకి దిగిన అగ్ర నిర్మాత

Nagavamshi Pawan

Nagavamshi Pawan

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను గెలిపించడం కోసం మెగా అభిమానులు , జనసేన , కూటమి శ్రేణులే కాదు చిత్ర పరిశ్రమ సైతం నడుం బిగించింది. గత ఎన్నికల్లో చిత్రసీమ కాస్త దూరంగా ఉన్నప్పటికీ..ఇప్పుడు నేరుగా కొంతమంది ప్రచారం చేస్తుండగా..మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ , హీరో నాని తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ సంపూర్ణ మద్దతును పవన్ కళ్యాణ్ కు తెలియజేయగా…పవన్ కళ్యాణ్ కు వీరాభిమానాలు హైపర్ ఆది ఎం సుడిగాలిసుధీర్, గెటప్ శ్రీను తదితరులు నేరుగా పిఠాపురంలో ప్రచారం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే బుల్లితెర నటి నటులు సైతం నియోజకవర్గంలో గత 20 రోజులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా అగ్ర నిర్మాత నాగవంశీ (Producer Nagavamsi) సైతం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈరోజు పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి..పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు. కొద్దీ రోజుల క్రితమే ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు తన మద్దతు తెలియజేసారు. ఇక ఇప్పడు నేరుగా ప్రచారం మొదలుపెట్టారు. వీరు మాత్రమే కాదు చాలామంది సినీ ప్రముఖులు తమ మద్దతును తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు చిరంజీవి పిఠాపురం (Pithapuram) ప్రజలకు వీడియో సందేశం కూడా పంపించి తన మద్దతును తెలియజేయడం తో అభిమానులు , పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Ambati Rambabu : అంబటి రాంబాబు సంబంధించి మరో బండారం బయటపెట్టిన అల్లుడు